దళిత బంధు ను అమలుచేయడానికి సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇప్పటికే దళిత బంధు పథకం వాసాలమర్రి (సి.ఎం. దత్తత గ్రామం) మరియు హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతోంది. దీంతోపాటు ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగి, నాగర్కర్నూల్ జిల్లా చారగొండ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ లో కూడా ఇస్తున్నారు.
దీనిపై సిసిఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లతో వీడియో సమావేశం జరిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 120 కోట్ల రూపాయలు కేటాయించగా ఇందులో ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశారని ఆయన కలెక్టర్ల సమావేశంలో తెలిపారు.
మొత్తం 118 నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్ధి చేకూరుస్తారు. ఇక్కడ ఒక కుటుంబం ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సలహా మేరకు ఈ లిస్ట్ ని రూపొందిస్తారు. మరియు ఈ జాబితా ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో ఆమోదం పొందవలసి ఉంటుంది.