చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆధ్వర్యంలో 9వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులతో కలిసి చిల్కనగర్ డివిజన్ లోని సాయి రామ్ నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ, ధర్మపురి కాలనీ, ఈస్ట్ కళ్యాణపూరి, శ్రీగిరి కాలనీల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారులకు తెలియజేయడం జరిగింది,
ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ కాలనీలలో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా డ్రైనేజీ, మంచినీటి, వీధి దీపాలు, రోడ్ల, సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది, రాఘవేంద్రనగర్ కాలనీలో ఇరిగేషన్ నాలాకి ఇరువైపులా కడుతున్న రిటైనింగ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకి ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో డివిజన్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు AE రాజకుమార్, DE నిఖిల్ రెడ్డి, శానిటేషన్ సుదీర్షన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మల్లేష్ వాటర్ వర్క్ సత్యనారాయణ, జంగయ్య,ఎంటమాలజీ సూపర్వైజర్ అజయ్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి,వీబీ నర్సింమ, రవీందర్ రెడ్డి,వెంకటేష్, మహేందర్,కొకొండ జగన్, బింగి శ్రీనివాస్,రామానుజం,ప్రవీణ్,యాదగిర, శ్రీకాంత్,ఉపేందర్, బాణాల నారాయణ రెడ్డి,బాలు,శ్యామ్, పలు కాలనీలలో అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, సతీష్, sukha రెడ్డి, నరసింహ, నర్సింగ్ రావు, మరియు వారి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.