సీఎం కేసీఆర్‌తో కలిసి సివిల్స్ టాపర్ మధ్యాహ్న భోజనం చేశారు
ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సోమవారం ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వారు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్ యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని అన్నారు.
ఇటీవల వెలువడిన సివిల్ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సివిల్స్ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి.