సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సిఐ కార్యాలయంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐ శ్రీలత, ఎస్ఐ సునీల్ కు ప్రొబేషనరీ ఎస్ఐలు క్రాంతి, సంతోష్ లతో పాటు సహోద్యోగులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా మహిళ పోలీస్ అధికారులు స్టాఫ్ కు రాఖీలు కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని స్వీట్లు తినిపించుకున్నారు.
చందుర్తి సిఐ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఇలియాస్ కు సీఐ శ్రీలత మత సామరస్యానికి ప్రతీకగా సోదర భావంతో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ వేడుకల్లో ఎస్ఐ సునీల్ , ప్రొబేషనరీ ఎస్ఐలు క్రాంతి ,సంతోష్, ప్రవళిక, ఏఎస్ఐ సోనా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..