పల్లెటూరు అన్నా…అక్కడి ప్రజలన్న చిన్న చూపు ఉండటం సహజం. అసలు పల్లెటూరి ప్రజలంటే ఆటో నుండి కిరాణా కొట్టువాడి దగ్గర నుండి పెద్ద పెద్ద కంపనీ యజమానుల వరకు ప్రతొక్కరు ఎలా మోసం చెయ్యాలా అని చూస్తారు. అలాంటి వాతావరణం నుండి వచ్చి ఒక్కడిగా వచ్చి ఒక సమూహమై సమ్మోహన శక్తి లా ఎదుగుతూ కళారంగం లో తన కంటూ ఒక మార్క్ తో దూసుకుపోతున్న “మిట్టపల్లి రాజేష్”(కొరియోగ్రాఫర్).తన కెరీర్ మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ మోడల్ రంగం వైపు మళ్ళీ మళ్లా అందులో కూడా విజయం దిశగా అడుగులు వేస్తూ,ఒక ఆర్టిస్ట్ కూడా ప్రయత్నాలు చేస్తూ అర కొర పాత్రలు వేసుకుంటూ మంచి సక్సెస్ వైపు మళ్లేందుకు కావాల్సిన కష్టం మొత్తం భరిస్తూ పెద్ద కళాకారుడు గా ఎదగాలి అని శ్రామిస్తున్న కళా యోధుడు…మన మిట్టపల్లి రాజేష్
“ సికింలాపూర్”గ్రామం, శివమ్ పేట్ మండలం, మెదక్ జిల్లా వాసి అయిన మిట్టపల్లి రాజేష్ చిన్నతనం నుంచే కళ ల పై ఆసక్తి తో అనుక్షణం కష్టపడుతూ తన జీవితాన్నే తానే మల్చుకుంటు ఎదిగారు. ప్రస్తుతం ఒక కొరియోగ్రాఫర్ గా ,ఒక ఆర్టిస్ట్ గా,లైన్ ప్రొడ్యూసర్ గా,ఒక మోడల్ కోర్డినేటర్ గా చేస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోయ్యేందుకు శ్రామిస్తున్న కళా జవాన్ మన మిట్టపల్లి రాజేష్ కి అందరి ఆశీస్సులు, అభిమానాలు,చేయూత దక్కి పెద్ద గుర్తింపు గల కళాకారుడు కావలని మనసారా కోరుకుందాం…..
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more