చింతల రామ చంద్రా రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
బీసీల పై దాడికి పాల్పడితే రాజకీయ భవిష్యత్తు శూన్యం
బిజెపి పార్టీ హై కమాండ్ ఘటనను పరిశీలించి చర్యలు వెంటనే తీసుకోవాలి అని డిమాండ్ చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. బీసీ నేత రామన్ గౌడ్ పై స్వాతంత్య్ర దినోత్సవం నాడు అవమానించడం బాధాకరమని అన్నారు దుండ్ర కుమార స్వామి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే రక్తం మరిగిపోతోందని అన్నారు. దేన్నీ చూసుకుని నీకు ఇంత అహంకారం చింతల రామచంద్రారెడ్డి అని ప్రశ్నించారు దుండ్ర కుమారస్వామి.
హిమాయత్ నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి భర్త రామన్ గౌడ్ పై బీజేపీ నేత చింతల రామచంద్ర రెడ్డి దాడి చేయడాన్ని బీసీ సమాజం ఏ మాత్రం సహించదని అన్నారు దుండ్ర కుమారస్వామి.
అగ్రకులానికి చెందిన నాయకులు బీసీలను ఎంత దారుణంగా చూస్తారో ఈ ఒక్క ఘటన చాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంత కుల దుహంకారం పెట్టుకొని ఓట్లు అడగడానికి ఎలా వస్తారో అది చూసుకుందాం. బీసీ నాయకుల్ని పబ్లిక్ గా అవమానించి ఎన్నో రెట్లు దిగజారిపోయాడు చింతల రామచంద్రారెడ్డి. ప్రజల కోసం ఎన్ని అవమానాలు భరించడానికి అయినా బీసీ నాయకులు సిద్ధంగా ఉంటారు కానీ.. ఇలాంటి ఘటనలు బీసీల గుండెల్లో గాయం చేస్తాయి. ఒక్కసారి పగిలిన దాన్ని అతికించడం చాలా కష్టం.. ఈరోజు చింతల రామచంద్రారెడ్డి చేసిన తప్పు క్షమించరానిది. బీసీల మనసును గాయపరిచిన చింతల రామచంద్రారెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ హై కమాండ్ ను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బీజేపీ హైకమాండ్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు దుండ్ర కుమారస్వామి.