చిలుకానగర్ : భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ఏడు సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది.
పేదలకు, కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నావారికి నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను 100 కుటుంబాలకు కాంటెస్టెడ్ కార్పొరేటర్ గోనె శైలజశ్రీకాంత్ గారి సహకారంతో అందించడం జరిగింది.

చిలుకానగర్ బిజైవైయం డివిజన్ అధ్యక్షులు డప్పు దత్తసాయి ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు కూరగాయలు అందించడం జరిగింది. బిజెపి సీనియర్ నాయకులు గోనె అంజయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అభిదత్త ఆనాథ ఆశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారం, పండ్లు, 50kg రైస్, అందించడం జరిగింది.
బిజెపి నాయకులు భరత్ రెడ్డి, పలుగుల నరేష్ కుమార్, సమ్మయ్య ఆధ్వర్యంలో భరతమాత వృద్దాఆశ్రమం లో 50kg రైస్, 5kg మామిడి పండ్లు, 5 డజన్ల అరటిపండ్లు, నాలుగు ట్రే లా ఎగ్స్, నాలుగు ఖజుర పండ్ల ప్యాకెట్లు కరోనా రాకుండా ఉండాలని ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది.
డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ స్వామి యాదవ్ & సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో అరటిపండ్లు పంపిణీ చేశారు.
మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట రేణుక ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి దాదాపు 100 కుటుంబాలకు మాస్క్ లు, శానిటేజర్స్ అందించారు. సీనియర్ నాయకులు ప్రవేశ్ సింగ్ & ఓబిసి మోర్చా అధ్యక్షులు గొట్టిముక్కల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై నివసించే పేదలకు, స్ట్రీట్ వెర్స్ కు దాదాపు 200 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు.
అలాగే నిన్న సేవా హీ సంఘటన్ లో భాగంగా డివిజన్ ఉపాధ్యక్షులు పలుగుల నరేష్ కుమార్ & తోట సమ్మయ్య పటేల్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఆదర్శనగర్ కాలనీ, వేంకటేశ్వరనగర్ కాలనీ లో శానిటేషన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి, బిజైవైయం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.