చెండాలంగా తయారైన చిల్కనగర్..
డిప్యూటీ మేయర్ వచ్చినా మారని కాలనీలు..
ఏంతో మంది లీడర్లు ఓట్ల కోసం వచ్చారు…
మా కాలనీ దుస్థితి చూశారు..
ఏం చెయ్యలేక పోయారు…
ఇంతవరకు ఏ ఒక్కరు కూడా చిల్కనగర్ ని పట్టించుకున్న పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా చిల్కనగర్ కాలనీ వాసులు డైనేజి సమస్యతో చాలా బాధపడుతున్నారు. డ్రైనేజ్ లికేజ్ తో వచ్చే వాసన వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో చాలామంది హాస్పిటల్ పాలయిన పరిస్థితి నెలకొంది.
చిల్కనగర్ డివిజన్ లో ఎక్కడ చూసినా ఇదే విధంగా డ్రైనేజ్ పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బుధవారం చిల్కనగర్ కాలనీ వాసులు పలు అభివృద్ధి కారిక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభ రెడ్డి గారు వచ్చారు. ఆమెతో కాలనీ వాసులు తమ భాద తెలియజేశారు. నిన్న మొన్న కురిసిన
ఈ డ్రైనేజ్ లికేజ్ నుండి వచ్చే వాసన వల్ల అన్నం కూడా తినలేని పరిస్థితి మాది అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.. డిప్యూటీ మేయర్ వచ్చినా కూడా మా కాలనీ పరిస్థితి ఈమాత్రం మరనేలేదు అని మండిపడ్డారు కాలనీ వాసులు.. నాయకులు ఓట్ల కోసం వచ్చి మీకు మేం అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గప్పాలు కొట్టి పోవడం తప్ప చేసిందేం లేదు అని కాలనీ వాసులు మండిపడ్డారు.
నిన్న మొన్న కురిసిన వర్షాలకు కాలనీ రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయిన పరిస్థితి ని డిప్యూటీ మేయర్ కి చూపిస్తూ వివరించారు. శ్రీలత రెడ్డి చూసి వెళ్లిపోయారు కానీ పెద్దగా పట్టించుకోలేదు అని కలనివాసులు వాపోయారు..
ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు కానీ, కార్పొరేటర్ కానీ, తొందరగా ఈ డైనేజి సమస్యని పరిష్కరించకపోతే ఏ ఒక్క లీడర్ కూడా మా కాలనిలో అడుగు కూడా పెట్టలేడు అని హెచ్చరించారు.. అవసరమైతే చిలకనగర్ మొత్తం రోడ్ షో నిరసన కార్యక్రమాలు చేపట్టి మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం అని కాలనీ వాసులు అల్టిమేటం జారీ చేశారు..