మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర , మెదక్ జిల్లా, చిలప్చెడ్ మండలంలో, తెలంగాణ రాష్ట్ర సమితి యువ నాయకులు చిలపచేడ్ జడ్పీటీసీ చిలముల శేషసాయిరెడ్డి తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారు అని, వీటికి మనస్తాపం చెంది పార్టీ కి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
చిలప్చెడ్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని నాపై ఎన్నో ఆశలు పెట్టుకొని నాకు జెడ్.పి.టి.సి.గా ఎన్నొకోవడం జరిగింది. నా ప్రజల ఆశల నిమిత్తం నేను నా పనులను చేయుటకు శాయశక్తులు ఎల్లవేళల్లో ప్రయత్నించాను. కాని నాకు కొందరు తాలుక నాయకులు, నా మండలంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్య క్రమాలకు నన్ను పిలవకుండా, నన్ను అవమానపరుస్తున్నారు. నేను తీవ్ర మనస్థాపానికి గురై, నేను స్వచ్చందంగా ఎవ్వరి బలవంతం లేకుండా టి.ఆర్.యస్. పార్టి క్రీయాశీల సభ్యత్వాన్ని వదులుకొనుటకు నిశ్చయించుకున్నాను, కావున నా యొక్క రాజీనామాను అమోదించగలరని రాష్ట్ర పెద్దలకు చిలముల శేషసాయి రెడ్డి మనవి చేశారు.