దేశ స్దాయి ప్రచార కమిటిలో స్దానం దక్కించుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
ఈసారి రాష్ట్రపతి ఎన్నిక చాలా నాటకీయపరిణామాల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో కాషాయం పార్టీ తమ అభ్యర్దిని గెలిపించి పట్టు నిలుపుకోవాలని ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అదే స్దాయిలో వివిధ రాష్ట్రాల పార్టీలు తాము మద్దతిస్తున్న అభ్యర్దిని గెలిపించుకోవాలని కూటమిగా ఏర్పడి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయట. ఈ క్రమంలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును కాషాయ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భరిలో నిలిచారు. దీనిలో భాగంగా విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం కోసం 11 మందితో కూడిన ఒక అత్యుత్తమ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రచార కమిటీలో టిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి చోటు దక్కడం ఎంతో గొప్ప విషయం.. ఇదిలా ఉండగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మ కోసం చేసే ప్రచారానికి కమళదళంలోని ముఖ్యనాయకులు అందరు కదులుతుండగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి కోసం కూటమిలోని ముఖ్యమైన నాయకులు కూడా పోరులో అడుగుపెడుతున్నారు. ఇకపోతే కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవారం రోజున నామినేషన్ వేయడం జరిగినది. ఈ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్ ఎం పీ రంజిత్ రెడ్డి, ఎంపి నామ నాగేశ్వరరావు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ,ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ,ఎన్‌సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.