ఘట్కేసర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పచ్చదనం పేరుతో, చెట్లను పెంచడం నిమిత్తమై, కోట్ల రూపాయలు వెచ్చించి, హరితహారం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని దుర్వినియోగం పాలు చేస్తున్నారని ఎంపీటీసీ పూలకంటి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండల్, చౌదరిగుడా గ్రామపంచాయతీ పరిసర ప్రాంతంలో, మొక్కలు నాటి, అనంతరం మొక్కలకు సంరక్షణార్ధం ట్రీ గార్డ్ కొన్నింటిని మాత్రమే నిర్మించి, హైటెన్షన్ వైర్లు కింద మొక్కలు నాటి ఇప్పుడు వైర్లకు అడ్డం వస్తున్నాయి అని చెట్లను నరికి వేయడంతో,సంరక్షణ లేక మొక్కలు నేల రాలుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మొక్కలు వాటి సంరక్షణార్థం, ఒక్కో మొక్కకు రు.1000 నుండి 1500 రూపాయలు ఖర్చు చేస్తూ, హరితహారం కార్యక్రమం చేపడుతూ ఉంటే, అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా, నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూ, కోట్లాది రూపాయలు మట్టి పాలు చేస్తున్నారని ఆయా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇక ప్రజాప్రతినిధుల విషయానికొస్తే, మొక్కలు నాటినంత వరకు మాత్రమే ఫోటోలకు ఫోజులు ఇచ్చి, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ, చేతులు దులుపేసుకుంటున్నారు కానీ మొక్కల సంరక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక, ఉన్నతాధికారులు స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలని ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి మరియు ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.