ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడినే జేఏసీ చైర్మన్‌గా నియమించడం సంప్రదాయం. ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఉన్న పి.అశోక్‌బాబు ఉద్యోగ విరమణ చేయడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పటికే ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానం చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహిస్తున్న డిప్యూటీ సెక్రటరీ జనరల్ స్థానంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివా్‌సను ఎంపిక చేశారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more