రాష్ట్రస్థాయి రజక సంఘాల ఆత్మీయ సమ్మేళనం
ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి
ఐలమ్మ స్ఫూర్థితో.. మనం పోరాడాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
రజక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజకులు ఆత్మగౌరవంతో జీవించాలి. మన హక్కులను మనం పోరాడి సాధించుకోవాలి అని తెలిపారు. ఆదివారం నాడు శేరిలింగంపల్లిలో శ్రీరామ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ రజకుల అభ్యున్నతి కోసం జాతీయ బీసీ దళ్ ఎప్పటి నుండో కృషి చేస్తోందని అన్నారు దుండ్ర కుమారస్వామి. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తినే నమ్ముకున్న అనేక రజక కుటుంబాలు తమ రెక్కల కష్టం మీదే జీవనం సాగిస్తున్నాయి. రజకులకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలి భరోసా ఇచ్చారు దుండ్ర కుమారస్వామి. రజకులు శ్రమ దోపిడీకి గురై సమాజంలో చిన్నచూపుకు గురవుతూ ఉన్నారు.. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా రజకులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు దుండ్రకుమారస్వామి.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజకులు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలని దుండ్ర కుమారస్వామి సూచించారు. ఆనాడు ఐలమ్మ రోకలిబండనే ఆయుధంగా చేసుకొని పోరాడారు. ఆమె వారసులం మనమేమీ దేనిలో కూడా తీసిపోకూడదు.
ఉద్యమాలు పోరాటాలు చేసి చాకలి కులం అనే పేరు నుండి రజక కులం పేరుగా మార్పించుకున్నప్పటికీ మన రజకుల జీవితాలలో ఆర్థిక సామాజిక రాజకీయ మార్పులు రాలేదని తెలిపారు .స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన సామాజికంగా సాంఘికంగా వెనుకబడి ఉన్నాము అని అన్నారు.రజకులంతా తమ పిల్లలను బాగా చదివించాలి.. ఆర్థికంగా స్థిరపడాలి. రజక కులస్థులకు నామినేటేడ్ పదవులు కూడా దక్కాలి. రజకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి అభివృద్ధికి కృషిచేసేలా ప్రభుత్వాన్ని మనమందరూ కోరదాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా చేతివృత్తులకు సహాయం పేరిట న వృత్తి బజార్ ని రంగారెడ్డి జిల్లా నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రజక సంఘ గౌరవ అధ్యక్షులు రాజు, అధ్యక్షుడు సందీప్ , ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి జానీ కార్యదర్శి వెంకన్న కోశాధికారి ధర్మ ,అయ్యప్ప సోసైటీ రజక సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, తెలంగాణ రాష్ట్రం నుంచి పలు రజక సంఘాల నాయకులు, బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, మేధావులు, న్యాయవాదులు, ఉద్యమ నేతలు, రాష్ట్రస్థాయి నాయకులు, యువజన నాయకులు వినయ్ , కార్యవర్గ సభ్యులు రామకృష్ణ ,శ్రీనివాస్, శ్రీ రామ్ ,ఎల్లయ్య, మల్లేష్ సుబ్రహ్మణ్యం తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.