అసలే కటిక చీకట్లో బ్రతుకులీడుస్తున్న పేదలకు ప్రభుత్వాలు మాటలతో నమ్మించి చేతలతో గొంతు కోస్తున్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మల్కాజ్ గిరి – మేడ్చల్ జిల్లా దేవరయంజాల్ గ్రామా రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిలో పేద గిరిజనుల వేసుకున్న గుడిసెలను చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బలమల్లేష్, సిపిఐ మల్కాజ్ గిరి – మేడ్చల్ జిల్లా కార్యదర్శి డిజి. సాయిలు గౌడ్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్ తదితరులు సందర్శించి వారి సమస్యలు తెలుసుకొని అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ సందర్బంగా గుడిసెవాసులు ఏర్పాటుచేసిన బహిరంగ సభనుద్దేశించి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మంత్రులను,బడా నాయకులను, భూబకాసురులను వదిలేసి పేదల గుడిసెలపై ఉక్కుపాదం మోపి తొలిగిస్తున్నారని తెలిపారు. వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఫార్మ్ హౌస్, గోడౌన్ లు వెలుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని, ఎందుకు వారి వైపునకు వెళ్లారని, కబ్జాకు గురైన 1500 వందల ఎకరాల దేవరయంజాల్ దేవాలయ భూములు ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవటలేదని అయన ప్రశ్నించారు. అంటే ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే, పీకేసి వారిపై ప్రతాపం చూపిస్తారా అని మండిపడ్డారు. పేదలకు ఏం సహాయం ఏం మేలు చేసాడని ప్రధాని మోడీ ఆజాది కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాడని, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఫుర్తైనా డాక్టర్ బిఆర్. అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయటలేదని అయన ప్రశ్నించారు. రాజ్యాంగం విద్య, వైద్యం, ఇళ్ళు ప్రసాదించిందని, ఇళ్ళు కట్టించే బాధ్యత ప్రభుత్వాలదే అని గుర్తు చేసారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులతో జల్, జంగల్, జమీన్ నినాదం తో పోరాటాలు నిర్వహించాలని అయన పిలుపునిచ్చారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయని, కొనలేక తినలేక పేదల బ్రతుకులు బజారున పడుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేసారు. దళిత, గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఈ దేశ పౌరులు, ఇక్కడే పుట్టారు, ఇక్కెడ హక్కులు ఉన్నాయన్నారు. కటిక పేదరికంలో పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ, గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని, పేదల జీవన స్థితి లు మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత అని వారు ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని అయన డిమాండ్ చేసారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదం తో భూపోరాటాలు చేసి 10 లక్షల ఎకరాలు పంచిన ఘనత ఒక్క సిపిఐ కె ఉందని గుర్తుచేశారు. పేద ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీ మీద ప్రత్యేకమైన నమ్మకం ఉందని, గుడిసెవాసులను ఇబ్బందులకు గురి చేస్తే ఉరుకునేదిలేదని, ఇళ్ల పట్టాలు ఇచ్చేవరకు వారికీ అండగా ఉండి పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. అజీజ్ పాషా మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో భూపోరాటాలు చేసిన సిపిఐ పార్టీ సుమారు 40కి పైగా కాలనీలు ఏర్పాటు చేసి పట్టా ఇప్పిచమని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు పేదలకు ఒక్క పట్టా కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు సిపిఐ ఎప్పుడు అండ ఉంటుందని పోరాటాల ద్వారానే ఇళ్ల పట్టాలు సాధించుకోవాలని అయన పిలుపునిచ్చారు. బాలమల్లేష్ మాట్లాడుతూ కూలినాలి చేసుకొనే పేదప్రజలు దేవరయంజాల్ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు. లేనిపక్షంలో మార్చ్ 13 న ఇళ్ల పట్టాల సాధనకై వేలాదిమందితో చలో కీసర కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో జిల్లా సిపిఐ నేతలు వెంకట్ రెడ్డి, రొయ్యల కృష్ణ మూర్తి, ఉమా మహేష్, శంకర్, సహదేవ్, యాదయ్య గౌడ్, నరసింహ, రాజేశ్వరి, జై సేవాలాల్ గుడిసెవాసుల సంఘం నేతలు మున్నా, వినోద్ నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
కులాల అతీతంగా బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి,...
Read more