కర్నూలు: జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీర్ప కాగినెల్లి ఐపియస్ నుండి కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గా సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి (ఐపియస్) ఆదివారం పదవీ బాద్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి ఎ ఆర్ పోలీసులు గౌరవ వందనం చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ మాట్లాడుతూ..
అందరం కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు.
ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. పోలీసు స్టేషన్లను ఆశ్రయించే వారికి న్యాయం జరగాలన్నారు. మహిళలు, పిల్లలకు సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగకుండా శాంతిభద్రతలు కంట్రోల్ లో ఉండేలా అందరం కలిసి పూర్తి స్దాయిలో పని చేద్దామన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏళ్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీని పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన జిల్లా ఎస్పీ సి.హెచ్ సుధీర్ కుమార్ రెడి గురించి, సుధీర్ కుమార్ రెడ్డి సివిల్స్ లో 2010 బ్యాచ్ కు కర్ణాటక క్యాడర్ ఐపియస్ కు ఎంపికయ్యారు.
గుంటూరు జిల్లా, నరసరావుపేట స్వస్థలం , పుదుచ్చేరి ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేశారు . ఇన్ఫోసిస్ లో రెండేళ్లు పని చేశారు. కర్ణాటకలో మొదటగా బత్కల్ ఏఎస్పీగా పని చేసి ఎస్పీగా పదోన్నతి పొందారు. బీదర్ , మాండ్య , దక్షిణ కన్నడ ( మంగళూరు ) , బెల్గాం జిల్లాల ఎస్పీగా పని చేశారు .
2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ కి డిప్యుటేషన్ పై వచ్చి ఎపి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పని చేస్తూ అక్కడి నుండి బదిలీ పై కర్నూలు జిల్లా ఎస్పీగా విచ్చేసి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎమ్. కె. రాధాక్రిష్ణ గారు, డిఎస్పీలు , సిఐలు ఉన్నారు.