ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గ్రహించింది. ఇవి సాధారణ న్యూస్ ఛానెళ్ల వలె లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గుర్తించింది. ఈ చానళ్ళూ మరియూ పాకిస్థాన్‌లోని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కూడా భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ వంటి వార్తలు, మరియూ మన దేశానికి వ్యతిరేకంగా ఈ అసత్య వార్తలను వ్యాప్తి చేస్తున్నారని నిషేధం విధించింది.
సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై నిషేధం విధించింది. వీటిలో 18 ఇండియన్ చానళ్ళు మరియూ 4 పాకిస్థాన్ ఛానెళ్లు నిషేధించారు.
ఈ చానళ్ళు ముఖ్యంగా దేశ భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించి అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నందున చర్యలు తీసుకున్నామని సమాచారశాఖ తెలిపింది. జాతీయ భద్రత విషయాల్లో జనాలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది తొలిసారి.