అందోల్: ఈ నేల 27వ తేదీన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన అఖిలపక్ష భేటీలో కేసీఆర్ రూపొందించిన దళితుల అభివృద్ధికై సమగ్ర ప్రణాళికను వివరిస్తూ, అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు స్థానిక శాసన సభ్యులు క్రాంతి కిరణ్ చంటి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అందుబాటులో ఉన్న దళిత నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా దళిత్ ఎంపౌర్మెంట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలను మరియు లక్ష్యాలను వివరించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ని సన్మానించి స్వీట్స్ పంచుతు సంబరాలు చేసుకున్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more