శేరిలింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక వాసులతో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్ పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు,కాంట్రాక్టర్ కు కార్పొరేటర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, తెరాస సీనియర్ నాయకులు కె రామ్ చందర్, గోవింద్ చారి,లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ రవి యాదవ్,వార్డ్ మెంబర్స్ కవిత, పర్వీన్ బేగం, జి గోపాల్,రఘు,గోపాల్ యాదవ్,ముంతాజ్ బేగం స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more