కుల గణన తీర్మానం చారిత్రాత్మకం – కుల గణన పై మేధోమధన సదస్సు-, జాతీయ బి సి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి(National president BC Dal Dundra kumaraswamy)
తెలంగాణలో సామాజిక ఆర్థిక కుల సర్వే- బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు
హైదరాబాద్ : సామాజిక ఆర్థిక కుల సర్వే పై జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కాచిగూడ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కుల సర్వేపై కార్యచరణ, విధివిధానాల ఖరారుపై మేధావులు, న్యాయవాదులు, మరియు రాష్ట్రస్థాయి బీసీ దళ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (National president BC Dal Dundra kumaraswamy) మాట్లాడుతూ అసెంబ్లీలో కులగణన తీర్మానం చేయడం పై హర్షం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణన నిర్వహించే పద్ధతులు, ప్రక్రియలు, విధానాలపై చర్చించి, నాయకుల నుండి సలహాలు మరియు సూచనలు తీసుకున్నారు. రాష్ట్రలో వెనుకబడిన తరగతుల సామాజిక నిర్మాణాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి కుల-ఆధారిత గణన అవసరమని అలాగే సంక్షేమ లక్ష్యంగా ప్రభావవంతమైన విధానాలను రూపొందించడానికి ఈ సమాచారం చాలా ముఖ్యమైనది దుండ్ర కుమార స్వామి తెలిపారు.
కుల గణన లో ప్రజలు గరిష్ట స్థాయిలో పాల్గొనడం మరియు సమగ్ర డేటా సెట్‌ను సృష్టించడానికి విస్తృత అవగాహన మరియు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సర్వే పూర్తి చేయడానికి తగినంత సమయం కేటాయించాలి. ఈ ప్రక్రియ చుట్టూ ఉన్న చట్టపరమైన నిర్మాణం బలంగా ఉండాలి, తద్వారా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కుల గణన వ్యక్తి గోప్యతా హక్కులను కాపాడే విధంగా ఉండి సంక్షిప్త ఫలితాలను కేవలం సామాజిక సంక్షేమం కోసం ఉపయోగించాలి మరియు బాధ్యతాయుతంగా వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని తెలిపారు. ఆధునక సాంకేతిక టెక్నాలజీ మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు మరియు ట్యాబ్ ద్వారా డేటా సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయవచ్చు మరియు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని జాతీయ బి.సి దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. మహేంద్ర బాబు తెలిపారు. ఈ సదస్సులో తీసుకున్న సలహాలు, మేధావుల, న్యాయవాదుల, సూచనలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కుల గణన (castecensus)నిర్వహించాలని జాతీయ బిసి దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి తెలిపారు. అలాగే తెలంగాణ లో ఉన్న ప్రజలందరూ ఈ సర్వే కి అందుబాటు లో ఉండి, పాల్గొని బి.సి ల అభివృద్దికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం కన్వీనర్ సత్యనారాయణ, జాతీయ బీసీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్ర బాబు, న్యాయవాది సాయి దినేష్, మరియు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు.