ఫేక్ డాక్యుమెంట్స్ తో కార్లను అద్దెకు తీసుకొని నంబర్ పేర్లు మార్చి విక్రయించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
మహేష్ నూతన్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. భీమవరంలోనే ఫోన్ మెకానిక్‌గాపని చేశాడు. ఇంతకుముందే ఫోన్ ఫోన్లను దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్సుగా కార్ల దొంగతనాలు ఎంచుకున్నాడు.
హైదరాబాదులో ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ వారి ఐడెంటి కార్డులు తీసుకొని డ్రైవర్లు కావాలంటూ యాడ్స్ ఇచ్చేవాడు. డ్రైవర్ జాబ్ కావాలని వచ్చిన వారి గుర్తింపు కార్డుల జిరాక్స్ లను తీసుకొని పంపించేవాడు. ఈ జిరాక్స్ పేపర్ ల తో ఆన్లైన్లో కార్లకి రెంట్ కి ఇచ్చే కంపెనీల నుండి కార్లను అద్దెకు తీసుకునే వాడు. తర్వాత లొకేషన్ ట్రాకింగ్ సిస్టం తొలగించి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాత నంబర్ ప్లేట్లను చేంజ్ చేస్తాడు. తర్వాత కారును ఇష్టమొచ్చిన ధరకు అమ్మేస్తాడు.
ఇంతకుముందు క్రెటా కార్ ను దొంగతనం చేసిన కేసులో పోలీసులు కి ఒక కంప్లైంట్ అందింది. దాని ఎంక్వైరీ లో భాగంగా సీసీ కెమెరా కెమెరాల్లో మహేష్ ని, తనకు సహకరించే ఇతర వ్యక్తులను పట్టుకున్నారు. పోలీసులు వారి నుంచి ఐదు కార్లు ఒక బైకులు స్వాధీనం చేసుకున్నారు.