వలిగొండ : వలిగొండ మండలం అరూర్ గ్రామ శివారులో స్విఫ్ట్ కారు అదుపు తప్పి లోయలో పడిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన పొలబోయిన బాలయ్య, జ్యోతి, దంపతులు, ముగ్గురు పిల్లలతో కలిసి, పెళ్లి రోజు సందర్భంగా వేములకొండ శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న వేములకొండ గుట్టకు వచ్చి దర్శనం చేసుకొని, తిరిగి ఇంటికి వెళుతున్న సందర్భంలో, అరూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీని చూసి పక్కకు తప్పుకునే క్రమంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవ్వరికీ ఏమి కాలేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అరూర్ గ్రామ ప్రజలు 108 కి ఫోన్ చేయగా వచ్చిన అంబులెన్స్ లో బాలయ్య, జ్యోతి దంపతులు, మరియు వారి ముగ్గురు పిల్లలను హాస్పిటల్కి పంపించారు..