దేశంలోనే తొలిసారిగా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ ఆధ్వర్యంలోనీ మహిళా ” లా ” కాలేజీలో సదస్సు
*పాల్గొన్న బోయినపల్లి వినోద్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోసు
న్యాయవాద వృత్తి సామాజిక ఇంజనీరింగ్
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్*
న్యాయవాద వృత్తి సామాజిక ఇంజనీరింగ్ అని, అట్టడుగు, అణగారిన వర్గాలకు న్యాయవాద వృత్తి ద్వారానే సామాజిక న్యాయం అందుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
గురువారం చైతన్యపురిలోని రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా న్యాయ కళాశాలలో ” లా ‘ విద్యార్తినుల ( మహిళా లా కాలేజ్ ) సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ ద్వారా దేశంలోనే తొలిసారిగా మెన్, వుమెన్ ” లా ” కాలేజ్ లను నిర్వహిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు.” లా ” విద్యార్థులు సామాజిక అంశాలపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వినోద్ కుమార్ సూచించారు. రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ( పీఠిక ) కు అనుగుణంగా లా విద్యార్థులు ముందుకు సాగాలని, పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలను అనుసరించాలని, తద్వారా న్యాయ వాద వృత్తిలో గొప్పగా రాణిస్తారని వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల మారుమూల ప్రాంతాలకు చెందిన బలహీన, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థినులు లా కాలేజీలో చదువుతుండడం గొప్ప విషయమని వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో హైకోర్టు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ , సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ మహిళా లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మానస, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుష్పాంజలి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ ఓ.ఎస్.డీ. డాక్టర్ పావని, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులతో వినోద్ కుమార్ సహ పంక్తి భోజనం చేయడం జరిగినది.రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ మహిళా లా కాలేజీ విద్యార్థినిలతో కలిసి గురువారం సాయంత్రం సహా పంక్తి భోజనం చేస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీ ఎస్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్