బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ అధిక వ్యాప్తి దృష్ట్యా నూతన వాక్సినేషన్ సెంటర్ బోడుప్పల్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ యందు సూపర్ స్ప్రేడెర్స్ (ఎక్కువ మందితో కాంటాక్ట్ కలిగిన వ్యక్తులు ) Ts వ్యాక్సిన్ app ద్వారా 12 విభాగములకు చెందిన సూపర్ స్ప్రేడర్స్ గుర్తించి రిజిస్ట్రేషన్ చేయబడును. ఈరోజు రెజిస్ట్రషన్ చేసిన వారికి మరుసటి రోజు వాక్సిన్ ఇవ్వబడును. ఇట్టి కార్యక్రమము 10 రోజుల పాటు నిర్వహించబడును. అదేవిధముగా ఇట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమమును ప్రారంభించుటకు గౌరవ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లా రెడ్డి గారు, కార్మిక మరియు ఉపాధి హామీ శాఖ మాత్యులు వ్యాక్సినేషన్ కేంద్రమునకు (MPPS) విచేయుచున్నారు. కావున అందరు గౌరవ కాన్సిల్ సభ్యులు రిజిస్ట్రషన్ మరియు వ్యాక్సినేషన్ కు సహకరించగలరని బోడుప్పల్ నగర పాలక సంస్థ కమీషనర్ తెలిపారు..
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more