మేడ్చల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా, బొడుప్పల్, న్యూ హేమా నగర్ కాలనిలోని Road No. 6,7 and 8 లలో ఈరోజు మంచినీటి సరఫరా పైప్ లైన్లు పగిలిపోయి, నీరు వృధాగా ప్రవహిస్తున్న సమస్యను గుర్తించిన 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దొంతర బోయిన మహేశ్వరి గారు, కృపా సాగర్ గారు పైప్ లైన్లు మార్చడం కోసం జలమండలి అధికారులను పిలిపించి సర్వే చేయించారు.
ఈ సర్వే లో జలమండలి మనేజర్ శ్రీ బ్రహ్మ రెడ్డి గారు, AE మమత గారు, వాటర్ లైన్ ఇన్స్పెక్టర్ రామరాజు గారు మరియు వాటర్ మ్యాన్ ప్రశాంత్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో TRS సీనియర్ నేత శ్రీ దొంతర బోయిన కృపా సాగర్ ముదిరాజ్ గారు మరియు కాలని వాసులు పాల్గొన్నారు.