ఒక హుజురాబాద్ కేనా?? మాక్కూడా దళిత బందు కావాలన్నా బోడుప్పల్ దళిత సోదరులు...
మేడ్చల్ : బోడుప్పల్ జులై 31(తొలిపలుకు ): తెలంగాణ రాష్ట్ర, హుజురాబాద్ ఉప ఎన్నికతో, సీఎం కెసిఆర్ దళిత బందు పథకం తెచ్చి, ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తాం అని అది కూడా పైలట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ నియోజకవర్గం నుండే మొదలుపెడుతాం అని చెప్పారు. అయితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దళిత సోదరులు మాకు కూడా దళిత బందు అమలు చేయాలనీ నిరసనలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఈటెల రాజేందర్ లాగా రాజీనామా చేసి, మాకు కూడా దళిత బందు వచ్చే లాగా కృషి చేయాలన్నారు . ఒక్కసారి ఎన్నికల కోడ్ వస్తే ఈ పథకం కూడ వరద సహాయం లాగా మర్చిపోతారు అని వాపోయారు. ఈ నిరసనలో జై కెసిఆర్… రాజీనామా మల్లన్న… అనే వినాదాలు చేసారు. ఈ కారిక్రమంలో రాపోలు రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు.