బోడుప్పల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి నీటి ఎద్దడిని నివారించేందుకు స్థానిక కార్పోరేటర్ బొమ్మక్ కళ్యాణ్ కుమార్, వాటర్ వర్క్స్ మేనేజర్ మమత లతో కలిసి త్రాగునీటి పైపులైన్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో డివిజన్ వాసులకు త్రాగునీటి సమస్య నివారించేందుకు ట్యాంక్ ప్రధాన లైన్ నుండి టీ జంక్షన్ వేయడంతో నీటి సరఫరా త్వరత్వరగా రావడం జరుగుతుందని, త్వరలో నీటి సమస్య తీరుతుందని తెలిపారు. డివిజన్ లోని కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమం లో మేనేజర్ మమత ,వర్క్ ఇన్స్పెక్టర్ రామరాజు ,నరసింహ,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.