నిజాంపేట్: ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ వుప్పల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ సంస్థ వారి సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు.ఈ సందర్భంగా గౌరవ మేయర్ గారు మాట్లాడుతూ..
రక్తదానం ప్రాణ దానంతో సమానమని,కావునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని సూచించారు. అందులో భాగంగా రక్త దానం చేసిన వారికి సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ గారు,నరసింహ రెడ్డి గారు,కోలన్ సునీల్ రెడ్డి గారు,లైఫ్ లైన్ ఫౌండేషన్ తెలంగాణ ఇంచార్జ్ దామా రామారావు, లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్,LLF ఇతర ముఖ్య సభ్యులు,TSCS సంస్థ ముఖ్య సభ్యులు,వైద్యులు మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు.