జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎం.కె.ఆర్.ఫంక్షన్ హాల్ లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ పద్మజ రెడ్డి సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమాన్ని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్, స్థానిక కార్పొరేటర్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో రక్తం లేక తలసేమియా బాధితులు బాధపడుతున్నారని ప్రభుత్వ ప్రస్తుతి ఆసుపత్రి రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో 100 మంది రక్తందానం చేశారు.
జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ పి. సైదులు మాట్లాడుతూ, ప్రజలకు రక్తదానంపై చాలా అపోహలున్నాయి. అత్యవసర సమయాలలో రక్తం దొరకక రోగులు చాలా అవస్థలు పడుతు న్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ డబ్బుచెల్లించి రక్తం తీసుకోవాల్సి వస్తోంది. కనుక మనలో చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ప్రతి ఆరోగ్యవంతమైన మానవ్ఞడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అయితే మన లో చాలామంది ప్రజలు రక్తదానం చేస్తే తమలోని శక్తి అంతా పోతుందని భ్రమపడుతున్నారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం కూడా వస్తుంది. కావున ప్రజలు రక్తదానంపై ఉన్న అపో హలు వీడాలి. యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖవారు ప్రజలను చైతన్యపరచాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, యాదగిరి, సిబ్బంది కృష్ణ మోహన్, అశోక్, మసాని శ్రీమాన్ నారాయణ, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.