మూషిరాబాద్: బీజేపీ మూషిరాబాద్ మాజీ ఎమ్మెల్యే & ఓబీసీ మోర్చా డా.లక్ష్మణ్ గారు దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న సంగతీ తెలిసిందే…ఈ నేపథ్యంలో గత కోద్ధి రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులు గురించి తెలుసుకుని, మీకు నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు.1994 నుండి తనవెంటే ఉండి, తననే నమ్ముకున్న బిజెపి సైనికులైనటువంటి కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని, మీరేం బయపడొద్దు మీకు నేనున్నాను అంటూ వారికి భరోసా ఇస్తూ, వారందరికి అపన్నాహస్తం అందించే కార్యక్రమంలో భాగంగా, ముషీరాబాద్ బిజెపి క్యాంప్ ఆఫీస్ లో, కార్యకర్తలకు ప్రతిఒక్కరికీ 25 కిలోల చొప్పున బియ్యం సాయంగా అందించారు.. ఈ సందర్భంగా రాంనగర్ డివిజన్ జనరల్ సెక్రెటరీ గడ్డం సతీష్ గారు మాట్లాడుతూ…
పెద్దలు, తెలంగాణ బిజెపి పార్టీ గౌరవ అధ్యక్షులు, డా.లక్ష్మణ్ గారు కరోనాని జయించడం మాకు పండుగలా ఉందన్నారు. వారు కొలుకున్న తర్వాత తన గురించి కాకుండా మా అందరి కుటుంబాల గురించి ఆలోచించి, ఈ కరోనా కష్టకాలంలో మా అందరికి పెద్దన్నగా అండగా నిలిచి, ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం అనేది మేం జీవితంలో మర్చిపోలేని రోజుగా భావిస్తున్నాం అన్నారు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, డా.లక్ష్మణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గా చూడాలనుకునే మా చిరకాల స్వప్నం తొందర్లో నెరవేరుతుంది అని గడ్డం సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు.