విషయంలోకి వెళితే రంగారెడ్డి జిల్లా దర్గా లో నివాసం ఉంటున్న బిజెపి మైనారిటీ మోర్చా ట్రెజరర్ షేక్ రహమతుల్లా తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. పంజాగుట్టలోని యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగినది. వెంటనే చికిత్స కూడా మొదలుపెట్టారు . తన ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంది, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేశారు.
ఈరోజు రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆశించిన షేక్ రహంతుల్లా కు ఇలా కావడం పలువురు స్నేహితులు కుటుంబ సభ్యులు బాధ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు కుమారస్వామి మరియు వ్యాపారవేత్త మారుతి, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రామ్ గోపాల్ రెడ్డి, భూస్వామి తదితరులు పరామర్శించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఆత్మ చరణ్ రెడ్డి ఫోన్ లో సంభాషణ చేసి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more