యు.పి. లో బి.జె.పి. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలివి. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ విడుదల చేశారు. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్ పేరుతో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
రైతులు, యువత, బాలికలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. 5 సంవత్సరాల వరకు రైతులకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని తెలిపారు.
రాణి లక్ష్మీబాయి యోజన పథకం ద్వారా కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువ శశక్తీకరణ్ యోజన కింద యువతకు 2కోట్ల ట్యాబ్‌లు ఇస్తామని వాగ్దానం చేసింది.
60 ఏళ్లు నిండిన స్త్రీలకు ఉచిత బస్సుల్లో ప్రయాణ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్, మా అన్నపూర్ణ కేంటీన్లలో రాయితీ భోజనం, హోలీ, దిపావళికి పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు.