విజయశాంతి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
బిజెపి నాయకురాలు,మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పుట్టినరోజును పురస్కరించుకొని బిజెపి జాతీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి షేక్ రహమతుల్లా విజయశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయశాంతి గారు మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ కార్యకర్తలు నిరంతరం ముందుండాలని పిలుపునిచ్చారు. 2023లో గోల్కోండ కోటపై కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలందరు ఆశిస్తున్నారని, వారి కోరిక త్వరలో తీరబోతుంది అని తెలియజేశారు. రహమతుల్లా మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుందని,ట్రిపుల్ తలాక్ బిల్లును చట్టంగా చేసి మైనార్టీ మహిళలను ఆకట్టుకుంది మరెన్నో సంక్షేమం లకు బిజెపి కేంద్ర బిందువు ఆతుందని తెలియజేశారు.