బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇటీవల కరోనాసోకింది. దాంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం మోత్కుపల్లి ఆరోగ్యం మరింత దిగజారడంతో.. ఐసీయూకి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
టీడీపీలో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీకి దూరమైన తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని అనుకున్నారు. కానీ, కేసీఆర్ నుంచి ఎటువంటి పిలుపు లేకపోవడంతో.. నవంబర్ 4,2019న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.