- కెసిఆర్ మైనంపల్లి దిష్టిబొమ్మల దగ్ధం.
చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గంలో మైనంపల్లి తిట్ల పురాణం పై బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసారు. చిల్కనగర్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గోనె శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిల్కనగర్ చౌరస్తాలో ర్యాలిగా వెళ్లి దిష్టి బొమ్మ దగ్ధం చేసారు.
గోనె శ్రీకాంత్ మాట్లాడుతూ మైనంపల్లి ఖబర్ధార్ నువ్వు చెసినా వ్యాఖ్యలకు బహిరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. పూటకో పార్టీ మార్చే నువ్వు మాట్లాడుతున్నావు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ మీద చెసిన వ్యాఖ్యలకు గాను కార్పొరేటర్ పై దాడికి గాను ఇవాళ స్వచ్చంద బంద్ నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరీ లో. ఈ కారిక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గోని నిరసన వ్యక్తం చేసారు.