రామంతపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతపూర్ జడ్.పి.హెచ్ఎస్ లో సోలార్ పవర్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ లో స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మరియు రామంతాపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొన్నారు.
ఈరోజు హెచ్ ఏ ఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ప్రతి సంవత్సరం చేసే టర్నోవర్ లో వచ్చిన లాభం 25% పబ్లిక్ సేవా కార్యక్రమాల్లో పెట్టడంలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్ స్కూల్స్, మరియు గర్ల్స్ హాస్టల్స్ ఎలాంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రతి సంవత్సరము డొనేషన్ ఇస్తున్న సందర్భంగా ఈ సంవత్సరము మన జడ్.పి.హెచ్ఎస్ రామంతపూర్ పాఠశాలలో10 KWP సోలార్ పవర్ గ్రిడ్ ప్యాక్ బిగించడం జరిగింది.
దానిలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథులుగా బిజెపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, అలాగే హెచ్ ఏ ఎల్ అడిషనల్ మేనేజర్ శ్రీ యమ్ జి కార్తికేయన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ హెచ్ఏఎల్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా డి ఈ ఓ యన్ సత్య సాయి ప్రసాద్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సాంబయ్య, మరియు.టి చర్స్ బృందం పాల్గొన్నారు
వారితో పాటు బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకురీ కుమారస్వామి, నారాయణ దాసు, వేముల వెంకట్ రెడ్డి, దయానంద్ రెడ్డి పాల్గొన్నారు.