చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా,చిల్కనగర్ డివిజన్లో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని చిల్కనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అదే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూన్న నేపథ్యంలో, ఈరోజు మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కూడా చిల్కనగర్ డివిజన్లో వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగిందని. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకొని కరోనా మహామ్మారి బారిన పడకుండా జాగ్రత్త పడాలని బేతి సుభాష్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా చిల్కనగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా కార్యాచరణ రూపొందించి అటు జిహెచ్ఎంసి ఇటు పారామెడికల్ సిబ్బందిని సమన్వయ పరుస్తూ, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అదేవిధంగా మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి కొత్త ఒరవడిని సృష్టించారు.
సామాన్యమైన ప్రజానీకానికి కూడా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చి కేవలం ఆధార్ కార్డు తీసుకొని ఈ మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్తే,
అక్కడే ఆన్లైన్ చేసి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ డిప్యూటీ DMHO డాక్టర్ నారాయణ రావు, Dr uszay అలీ, Dr అశ్విని, సూపర్వైజర్ బోగా ప్రకాష్ PO రమాదేవి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు ఏదుల కొండల్ రెడ్డి, వీబీ నరసింహ, రామ్ రెడ్డి, ఈరెలి రవీందర్రెడ్డి,మాస శేఖర్,గరికెయ్ సుధాకర్, పరమేష్,కొంపలి రవి,కొకొండ జగన్, మహమూద్ బింగి శ్రీనివాస్, రామనుజం, రవీందర్ గౌడ్, ప్రవీణ్, బాలు,శ్రీకాంత్, సుందర్, ఉపేందర్, శ్యామ్, సాయినాజ్ అనసూయ, అందాలు, సుభద్ర, సకీనా మొదలగు వారు పాల్గొన్నారు