తెలంగాణ రాష్ట్ర శాంతిభద్ర తల పరిరక్షణలో విశేష కృషి కనబరిచినటువంటి పోలీసులకు, 2020-21కి గాను ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందిని 17 విభాగాలుగా విభజించి, ఉత్తమ సేవలందించిన వారిని రాష్ట్ర స్థాయిలో అవార్డులకు ఎంపిక చేశారు. పరిపాలనా విభాగంలో ఉత్తమ సేవలందినందుకు మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుండి బి.హనుమ నాయక్ (ASI )కి బెస్ట్ స్టేషన్ రైటర్ గా..
అలాగే ఎమ్. కుమార్ హెడ్ కానిస్టేబుల్ , బెస్ట్ సెక్షన్ ఇంచార్జ్ గా..
రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యి మంగళవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంశ పత్రాన్ని అందుకున్నారు. వీరిద్దరికి “తొలిపలుకు” శుభాకాంక్షలు తెలియజేస్తుంది.