బెంగళూరులో జరిగిన ఓ బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైవేపై బైక్ మీద వెళ్తున్న ఓ జంట.. ముందున్న ఓ స్కూటీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చాలా వేగంగా వెళ్తున్న ఆ బైక్ ఆ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ స్కూటీపై ఉన్న వ్యక్తితోపాటు బైక్‌పై ఉన్న భార్యభర్తలు కూడా కిందపడిపోయారు.
అయితే వాళ్ల చిన్నారి మాత్రం అలాగే బైక్‌పై ఉండిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆ బైక్ సుమారు అర కిలోమీటరు మేర ముందుకెళ్లిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని పడిపోయింది. దానిపై ఉన్న చిన్నారి డివైడర్‌పై ఉన్న పచ్చికపై పడటంతో గాయాలేమీ కాలేదు. కార్తీక్ గౌడ అనే వ్యక్తి కారు డ్యాష్ కెమెరాలో ఈ యాక్సిడెంట్ తాలూకు వీడియో రికార్డయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లిదండ్రులకు మాత్రం గాయాలయ్యాయి.
CCTV Footage Of Baby Miracle Escape From Bike Accident In Bangalore