బీసీలకు న్యాయం జరిగేది ఎన్నడు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు
కులగణనకు ఎందుకు అడ్డుగా నిలుస్తున్నారు?బిజెపి*
ఎన్నికల ముందు కాంగ్రెస్, బిజెపి, బీసీ జపం.. ఆ తర్వాత వెన్నుపోట్లు
అన్ని కులాలకు అన్ని వర్గాలకు రాజకీయంలో భాగస్వామ్యం సామాజిక న్యాయం దక్కాలి అని దుండ్ర కుమారస్వామి తెలిపారు.
హైదరాబాద్ లోని కాచిగూడ లో
బీసీ దళ్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు అండగా నిలిచే పార్టీలకే వెనుకబడిన కులాల మద్దతు తెలపాలని కోరారు. బీసీలను ప్రసన్నం చేసుకునేలా మేనిఫెస్టోను తీసుకుని వచ్చే పార్టీనే ప్రజలు ఆశీర్వదిస్తారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రయోగానికి దారులు వేస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం, అధికారంలో తగిన వాటా కల్పిస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇవన్నీ అవాస్తవాలు అని తెలిపారు. బీసీలపై ప్రేమ ఉంటే జనాభా గణనలో కులగణన, బీసీ ఉప ప్రణాళిక అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని,ఆ తర్వాతే బీసీలు బిజెపిని నమ్ముతారని అని దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఎన్నికల ముందు బీసీ జపం.. ఆ తర్వాత వెన్నుపోట్లు:
ఎన్నికల ముందు వరకూ బీసీల జపం చేయడం.. ఆ తర్వాత మోసం చేసిన పార్టీలు చాలానే ఉన్నాయని.. ఈ విషయం గుర్తుంచుకోవాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ సారథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ఎంబీసీల కోసం పీఎం విశ్వకర్మయోజన పథకం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, సదుపాయాల కల్పన వంటివి చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే వీటి వల్ల ఫలితాలు బీసీలకు చేరుతాయో లేదో అనుమానాలు ఉన్నాయని దుండ్ర కుమారస్వామి అన్నారు.
బీసీలకు మోసం చేస్తోంది ఎవరు?
తెలంగాణలో బీసీ వర్గాలు ప్రతి ఎన్నికల్లోనూ మోసపోతూనే ఉన్నారని.. ఈ ఎన్నికల్లో కూడా మోసపోవడానికి సిద్ధంగా అయితే లేరని దుండ్ర కుమారస్వామి అన్నారు., బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీజేపీని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీల డిమాండ్లను అన్నిరాజకీయ పార్టీలు ఎన్ని కల మేనిఫెస్టోలో చేర్చాలన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీలను అన్ని రకాలుగా వాడుకొని నిండా ముంచిన పార్టీలను పాతాళంలోకి తొక్కేయబోతున్నామని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. 50శాతం బీసీ టికెట్ల అంశాన్ని పలు పార్టీల అధ్యక్షులు అనుకూలంగా స్పందించారని కూడా తెలిపారు.
కులగణనకు ఎందుకు అడ్డుగా నిలుస్తున్నారు?
కేంద్రం కూడా కులగణనపై ఆలోచించాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. దేశంలో పండే ప్రతి గింజకు, పండిన పంటకు, పాలు, కూరగాయల ఉత్పత్తికి లెక్కలు ఉన్నాయని.. కానీ వాటిని లెక్కించే మనుషుల లెక్కించడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీ జనాభా ఎంత ఉందో , స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లెక్కించలేకపోయాయి. బీసీల సంక్షేమాన్ని, రిజర్వేషన్లను, రాజ్యాధికారంలో వారి వాటాను అందించకపోవడానికి ఇదే కారణం. దీన్ని బీసీలు గమనించాలని దుండ్ర కుమారస్వామి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఎంత ఉందో లెక్కించి వారి జనాభాకు తగ్గ రిజర్వేషన్లు కేటాయించి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారని.. ఆయన మాటలను నమ్మొచ్చా అనే అనుమానాలు తమకు ఉన్నాయన్నారు దుండ్రకుమారస్వామి. స్వాతంత్ర్యం ముందు నుంచి ఇప్పటివరకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, అధికారాన్ని, ప్రభుత్వాలను, 140 కోట్ల ప్రజల ఆర్థిక వనరులను శాసించే రంగాలన్నీ ఎవరి గుప్పెట్లో ఉన్నాయో అందరికీ తెలిసిందేనని అన్నారు దుండ్ర కుమారస్వామి. అభివృద్ధిని, అధికారాన్ని కొన్ని కులాలకే పరిమితం చేసి తరతరాలుగా పరిపాలన చేస్తూ మిగతా కులాలను వెనుకబాటుతనానికి గురి చేస్తూనే ఉన్నారని.. ఈ పద్ధతులు మారాల్సిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నామని దుండ్ర కుమారస్వామి తెలిపారు.