మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు E .సువర్ణ ఆధ్వర్యంలో జిల్లాలోని బిసి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సువర్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీసీలకు పరిమితం చేసి టిక్కెట్ ఇవ్వకుండా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .అంతేకాకుండా బీసీలకు అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాల్లో 21 మాత్రమే కేటాయించడం బీసీలకు అన్యాయమని రాష్ట్రంలో 52% బీసీలు ఉండగా ఇంత తక్కువ టిక్కెట్ లివ్వడం పై తీవ్ర బాధకు గురైనారు .బీసీలకు ఇచ్చింది భిక్షం కాదు బీసీలు కోరింది మన వాటా అని ,కనీసం రెండవ జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.అంతేకాకుండా మిగతా పార్టీలు కాంగ్రెస్ కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు . బీసీల అభ్యున్నతి కోసం, చైతన్యం కోసం, ఐక్యమత్యం కోసం , రిజర్వేషన్లు, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ,రాజకీయ సామాజిక ఆర్థిక ప్రజాస్వామిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చిందని ,బీసీలు సమరానికి సిద్ధం కావాల్సిందని, ప్రతి బీసీ నాయకుడు ఒక శక్తిగా మారాలని,ఓటు అనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనకిచ్చిన పెద్ద వరమని తెలియజేశారు. ఈ సమావేశం తదుపరి
బీసీ కార్యకర్తలతో వెళ్లి గౌరవ మున్సిపల్ చైర్మన్ మునిమంద స్వరూపను శాలువతో సన్మానం చేయడం జరిగింది .
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more