బీసీ సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆ పరిపాలన నా కళ్లారా చూడాలని దానికోసం ప్రతి బిసి ఓటును అస్త్రంగా మార్చాలని అంతేకాకుండా బీసీలలో చైతన్యాన్ని తీసుకురావాలి ,అప్పటి వరకూ నా పోరాటం ఆగదని తెలియజేశారు.
అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను చూస్తుందని బీసీలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని బాధాకరం.
ఈ రోజు బిసి లకు స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.
ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు ఎంతసేపు మనల్ని అడుక్కుతినేవాళ్ల లాగానే చూస్తున్నారని సీట్ల విషయంలో మొండి చెయ్యి చూపిస్తున్నారు దీనిని నేను ఖండిస్తున్నాను పల్లపోతు భగవను దాసు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన శాసనసభ టిక్కెట్ల కేటాయింపు జాబితాలో అగ్రవర్ణాలకు 52 సీట్లు కేటాయిస్తే బీసీలకు 20 సీట్లు కేటాయించడం చాలా బాధకరమని , కనీసం 55 మంది బీసీలు ఆ జాబితాలో ఉండాలని అని తెలియజేశారు.
అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 52% టిక్కెట్లు ఇవ్వాలని, ఏ రాజకీయ పార్టీ బీసీలకు 52% టిక్కెట్లు ఇస్తారో వారికి మా ఓటు ఉంటుందని చెప్పారు .అన్ని రాజకీయ పార్టీ మ్యానిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఏ నియోజకవర్గంలోనైనా బీసీలు ఎన్నికల బరిలో ఉంటే మన ఓటును ఉపయోగించి వారిని గెలిపించాలని దాని కోసం రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తానని ,ఓటు మన రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని సద్వినియోగం చేసుకోవాలని బీసీ జాతికి పిలుపునిచ్చిన పల్ల పోతూ భగవాన దాస్.