బిసి ల సమస్యలపై బిసి నాయకుల సమావేశం.
*పార్లమెంటులో బిల్లు పెట్టాలి
*జనగణనలో కుల గణన చేయాలి- జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు కుమారస్వామి
ఈరోజు బీసీ దళ్ ప్రధాన కార్యాలయంలో బిసి ల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బీసీ మేధావులు,నాయకులు పాల్గొని పలు బీసీ సమస్యల పైన మరియు బీసీలకు రాజ్యాధికారం వాటా, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని పలు అంశాల మీద చర్చించారు. బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి మాట్లాడుతూ, పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే త్వరలో జనాభా గణనలు కుల గణనచేయాలని డిమాండ్ చేశారు.బీసీలలో అనేక కులాలు ,74 సంవత్సరాల నుంచి వెనక పడుతున్నాయని దానికి గల ప్రధాన కారణం రిజర్వేషన్ రాకపోవడం , మరియు కులాల వారీగా జాన గణన లేకపోవడమే అని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాటాలు చేసి సాధించుకోవాలని తెలియజేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను పోరాడి సాధించుకోవాలని పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని తెలియజేశారు. .త్వరలో వివిధ సమస్యలపై పటిష్టమైన కార్యాచరణ తో బిసి దళ్ ముందుకు సాగుతుందని ఈ సంధర్భంగా దుంద్ర కుమార స్వామి తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ ఏ. పద్మ చారి మాట్లాడుతూ తెలంగాణలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి అని అలాగే బిసి రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బిసి దళ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ డి.పి చారి , తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏల్డర్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, సయ్యద్, మాజీ బాడీ బిల్డర్ వైస్ చైర్మన్ రాజేష్ కుమార్, మరియు ఇతర బీసీ మేధావులు పాల్గొనడం జరిగింది.