సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఏం ఎల్ ఏ
గుండా మల్లేశ్ మృతి పట్ల బిసి దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గుండా మల్లేశ్ అకాల మృతి తీవ్రంగా కలిసివేసిందన్నారు ప్రజల నాయకుడు , ప్రజల సమస్యల నుండి పుట్టుకువచ్చిన నాయకుడు గుండా మల్లేశ్ , తనకు అత్యంత పూజ్యులు , సన్నిహితులు పితృ సామానులు అని తెలిపారు. అదిలాబాద్ , బెల్లంపల్లి నియోజికవర్గం నుండి పలు మార్లు ఏం ఎల్ ఏ గా గెలిచి , ప్రజల మన్ననలు పొందిన ప్రజా నాయకుడు , సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కూడా గుండా మల్లేశ్ పని చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి మాలి దశ ఉద్యమం వరకు చురుగ్గా పాల్గొన్నారని కుమార స్వామి తెలిపారు. ఆడంబారాలకు , వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యల పై పోరాడే అలుపెరుగని నాయకుడు అని తెలిపారు.ఎంతటి కష్టమొచ్చినా బాధ వచ్చిన తనలోనే ఉంచుకునే, ఎవరు సహకరించినా సహా సహకరించకున్నా బాధను కష్టాన్ని తన గుండెల్లోనే ఉంచుకుంటూ చిరునవ్వుతో ముందుకుపోయే సాహసి,కమ్యూనిస్టు సిద్ధాంతాలను లక్షణాలను తన జీవితంలో కనిపిస్తాయి, సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం దాన్ని ఆచరించడం ఆయన వ్యక్తిత్వం,ప్రజలతో మమేకం కావడం ప్రజల మనిషిగా నిలవడం ఆయన ప్రత్యేకత ధరించే దుస్తుల్లో మొదలుకొని నివసించే జీవన శైలి వరకు కమ్యూనిస్టు భావాలు కనపడతాయి.రక్త సంబంధాల కన్నా కమ్యూనిస్టు సిద్ధాంతాలే గొప్ప అని నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి
ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న గుండా మల్లేష్ శ్వాస కొస సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న మల్లేశ్ నిమ్స్ ఆసుపత్రి లో చేరారు , ప్రేత్యేక వైద్యం పొందుతున్న మల్లేశ్ కి మధుమేధం , కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ,
మల్లేశ్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యం గా వస్తారని అనుకున్నామన్నారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం అని తెలియజేశాడు.