తెలంగాణా రాష్ట్ర బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు దుండ్ర కుమారస్వామి తెలంగాణా రాష్ట్ర ఐదవ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989వ బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ.సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక తోలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించిన రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్.పి. సింగ్, ఎస్.కే.జోషి ల తర్వాత ఐ.ఏ.ఎస్. క్యాడర్లో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవికి తనకన్నా ముందు రేసులో ఉన్న అనేక సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోమేశ్ కుమార్ ని ఎంపిక చేయడం జరిగింది. అందుకు ప్రధాన కారణం, సోమేశ్ కుమార్ సర్వీసు ఇంకా డిసెంబరు 31, 2023 వరకు మూడు సంవత్సరాలు ఉండడం మూలంగా పరిపాలనా వ్యవహారాల్లో స్థిరత్వం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన గతంలో కమిషనర్ గా పనిచేసినప్పుడు జి.హెచ్.ఎం.సి. పెద్దమొత్తంలో ఆస్థి పన్నును రాబట్ట గలిగింది. క్యాంటీన్ల ద్వారా రూ.5/- భోజన పధకం కుడా ఆయన హయంలోనే రూపుదిద్దుకుంది. రెవిన్యూ శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జి.ఎస్.టి. మరియు వాణిజ్య పన్నులు మరియు ఎక్సైజు శాఖల ద్వారా ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చి పెట్టారు. గిరిజన సంక్షేమం శాఖలో పనిచేసినప్పుడు మొదటిసారి గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా భూపరిపాలన శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూసర్వే ప్రణాలికలు కుడా సిద్ధం చేసారు. ఆర్.టి.సి. సమ్మె సమయంలో కుడా ప్రభుత్వం తరుపున నియమించిన కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆర్.టి.సి. ఆదాయ మార్గాలను పెంచే అనేక సూచనలు చేసారు. ప్రస్తుత ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో రాష్ట్రలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, పొదుపు చర్యలు పాటిస్తూ రాష్ట్రాన్ని గట్టేక్కించాలంటే ప్రతిభతో పాటు కొంతకాలం స్థిరంగా పనిచెయ్యడానికి తగిన సర్వీసు కుడా అవసరం. డిసెంబరు 22, 1963 లో జన్మించిన సోమేశ్ కుమార్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో పి.జి పట్టా పొంది ఐ.ఏ.ఎస్. కు ఎంపికయ్యారు. మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రలో బోధన్ మరియు నిజామాబాదు ల్లో సబ్-కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి అనంతపూర్ జిల్లా కలెక్టరుగా నియమింప బడ్డారు. ఆయన నిర్వహించిన ఏ శాఖలో ఐనా తనదైన ముద్ర కనపరచే సోమేశ్వర్ రావు ఐ.ఏ.ఎస్. తన పదవి కాలంలో రాష్ట్రం ఆర్ధిక మాంద్యం నుండి బయటపడి అభివృద్ధి వైపు దూసుకుపోవాలని, ప్రజలకు పరిపాలనలో పారదర్శకత, ఉద్యోగుల్లో జవాబుదారీతనం తీసుకురావడంలో వారు సఫలికృతులు కావాలని కోరుకుందాం.
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
కులాల అతీతంగా బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి,...
Read more