మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం కావడం పై
ఆగ్రహం వ్యక్తపరిచినా. బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుంద్ర కుమారస్వామి
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం శాంతినగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం అవడం పై బి సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కుమార స్వామి సదరు పాలకుర్తి అధికారులను సంప్రదించడం జరిగింది. పాలకుర్తి సీఐ గారు బోర్ వెల్ వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ సంఘటనపై బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ
సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం అవడం చాలా బాధాకరం మరియు దురదృష్టకరమని చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం కావడానికి కారకులైన వారి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలని, దాని వెనుక గల కారణాలను కూడా పూర్తిగా విచారణ జరిపించాలని అధికారులకు కోరారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన మహాత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.మరియు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని తెలియ చేశారు.