తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జితేందర్ (లా అండ్ ఆర్డర్) గారిని, నూతన సంవత్సర సందర్భంగా , బి.సి.దళ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్న పోలీసుల పాత్ర అభినందనీయమని తెలిపారు.పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఉన్నత చదువులు చదివి ఐ.పి.ఎఎస్ సాధించి 1992సం. బ్యాచ్ తెలంగాణ కేడర్ కు ఎంపిక అయ్యారు. వివిధ శాఖల్లో, వివిధ హోదాల్లో పనిచేసి పదవులకే హుందాతనం తెచ్చిన గొప్ప వ్యక్తి జితేందర్ గారు అని ఈ సందర్భంగా కొనియాడారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత సురక్షితం చేయడానికి అదేవిధంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించడానికి అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం ప్రతి కమిషనరేట్ పరిధిలో ఒక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల సీసీటీవీ సిసి కెమెరాలకు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. అంతే కాకుండా ట్రాఫిక్ విభాగంలో ఐ.టి.ఎం.ఎస్. (ఇంటలిజెంట్ ట్రాఫిక్ మానేజ్మెంటు సిస్టం) వంటి అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన ఫలితాలను సాధించడంలో అనేక ప్రణాళికలు రూపొందించారు.శ్రీ.జితేందర్ ఐ.పి.ఎస్ గారు రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి తెలంగాణ సమాజానికి తమ నిస్వార్ధ సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలిపారు.