రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన గుట్టల బేగంపేట్ లొ వినాయక చవితి పురస్కరించుకుని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ యొక్క కార్యక్రమాలలో కుల, మత, జాతి, విభేదం లేకుండా గుట్టల బేగంపేట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని గుట్టల బెగం పేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యువత లక్ష్యం పెట్టుకుని లక్ష్య సాధన కొరకు దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నిరంతరం లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం చేయాలి అని ,
భారతదేశానికి యువత ఒక గొప్ప సంపద భారతదేశానికి యువత వెన్నుముక లాంటిది అలాంటి యువకులను బలమైన ఆయుధాలు అస్త్రాలుగా మలిచి మంచి మార్గంలో ఉపయోగించుకోవాలి అని వారి శక్తిని నైపుణ్యాలను బయటకు తీసుకురావాలని తెలియజేశారు అంతేకాకుండా ప్రపంచ జనాభాలో సింహభాగం యువత ఉండటం వలన ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి యువతలో దాగి ఉందని యువశక్తితో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని మన జ్ఞానాన్ని, మేధావితనాన్ని ఆలోచనని దేశ ,రాష్ట్ర, పట్టణ, గ్రామ,అభివృద్ధికి వాడాలని తెలియజేశారు .మెదడులో ఆలోచన పుట్టి అది మనసులో గట్టిగా నమ్మ గలిగితే యువత ఏదైనా సాధించగలరని విద్యతో సమాజంలో గుర్తింపు గౌరవం దక్కుతోంది అందువల్ల ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు .
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వి వెంకటరమణ
గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్,-బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్ ,అఫ్రోజ్ ,బి యాదగిరి ,హరేందర్ ,నరేందర్ కిరణ్, చరణ్ , వాసు పాల్గొన్నారు .