తొలిపలుకు న్యూస్ (మాదాపూర్): ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లలోని పలు నియోజక వర్గంలో ఫతేనగర్, బల్కంపేట్, మాదాపూర్ మరియు ఇతర ప్రాంతాలలో పలు వినాయక మండపాలని బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు నేషనల్ మైనార్టీ లీడర్ రహముతుళ్ళ సందర్శించారు. వినాయక చవితి ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ…
ప్రజలందరిని ఆ గణనాధుడు చల్లగా చూడాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని, రాష్ట్రప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
