తొలిపలుకు న్యూస్ (హైదరాబాద్) : తారా ఆర్ట్స్ అకాడమీ.. ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక వారి సహకారంతో పలువురి ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అవార్డులు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా బీసీ దల్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారికి ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. కొన్ని సత్కారాలు, కొన్ని జ్ఞాపకాలు మనిషి జీవితంలో మరువలేనివి, అవే మన సేవలకు గుర్తింపు… అవే మనిషికి నిజమైన అవార్డులు అంటూ సంతోషాన్ని తెలియజేశారు.