బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిండు నమస్సుమాంజలి తెలియజేస్తూ, అంబేద్కర్ గారు భవిష్యత్ ని అంచనా వేసి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా “రాజ్యాంగాన్ని రూపొందించారు, దానిని అందరు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, తరతరాలుగా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఆ దిశగా నడుం బిగించి అలుపెరగని పోరాటం చేయాలి అని బిసి దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలియచేశాడు.
ఈ సందర్భంగా బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి మాట్లాడుతూ,
“హక్కుల కోసం ప్రపంచం అంతా ఒక్కటి చేసి, జ్ఞానంతోనే లోకం మార్పుకు దారులు పరిచి,
బహుజన జాతుల విముక్తి కై బరి గీసి కొట్లాడి, ప్రపంచంలోనే మహానేతగా ప్రసిద్ధికెక్కిన మహానియుడికి ఘనంగా నివాళులు తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో అనిల్ , నాగరాజు ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more